Telugu Essay on "Sita", "సీత తెలుగు వ్యాసం" for Students

Telugu Essay on "Sita", "సీత తెలుగు వ్యాసం" for Students

Essay on Sita in Telugu Language: In this article, we are provoding "సీత తెలుగు వ్యాసం", "Paragraph on Sita in Telugu" and "Sita Telugu Essay" for Students

Paragraph on Sita in Telugu

Essay on Sita in Telugu

Paragraph on Sita in Telugu Language

సీత కేంద్ర స్త్రీ పాత్ర మరియు హిందూ ఇతిహాసం, రామాయణం మరియు దాని ఇతర వెర్షన్లలో కేంద్ర వ్యక్తులలో ఒకరు. ఆమెను భూమి దేవత కుమార్తె, భీమి మరియు విదేహ రాజు జనక దత్తపుత్రిక మరియు అతని భార్య క్వీన్ సునైనా అని వర్ణించారు. ఆమెకు ఒక చెల్లెలు, m ర్మిలా, మరియు ఆడ దాయాదులు మాండవి మరియు శ్రుతకిర్తి ఉన్నారు. సీత తన అంకితభావం, ఆత్మబలిదానం, ధైర్యం మరియు స్వచ్ఛతకు ప్రసిద్ది చెందింది సీత, యవ్వనంలో, అయోధ్య యువరాజు అయిన రామాను తన భర్తగా స్వయంవరలో ఎంచుకుంటుంది - వధువు ఒక పోటీ తర్వాత సూటర్స్ గుంపు నుండి ఉత్తమమైనదాన్ని ఎంచుకుంటుంది, ఇక్కడ రామా రుజువు చేస్తాడు అతని వీరత్వం మరియు శౌర్యం మరియు యుద్ధ శక్తి మరియు వివాహంలో సీత హస్తం కోసం ఇతర అన్వేషకులను "ఓడిస్తుంది". స్వయంవర తరువాత, ఆమె తన భర్తతో కలిసి తన రాజ్యానికి వెళుతుంది, కాని తరువాత తన భర్తతో పాటు, తన బావ లక్ష్మణుడితో పాటు తన ప్రవాసంలో ఉండటానికి ఎంచుకుంటుంది. ప్రవాసంలో ఉన్నప్పుడు, ముగ్గురూ దండకా అడవిలో స్థిరపడతారు, అక్కడ నుండి లంక రాక్షస రాజు రావణుడిచే ఆమెను అపహరిస్తారు. ఆమెను బందీగా చంపిన రాముడిని రక్షించే వరకు ఆమెను లంకలోని అశోక వాటికాలో బంధిస్తారు. యుద్ధం తరువాత, ఇతిహాసం యొక్క కొన్ని వెర్షన్లలో, రాముడు అగ్ని పరిక్ష (అగ్ని పరీక్ష) చేయించుకోవాలని సీతను అడుగుతాడు, దీని ద్వారా ఆమె రాముడు అంగీకరించకముందే ఆమె స్వచ్ఛతను రుజువు చేస్తుంది, ఇది మొదటిసారి తన సోదరుడు లక్ష్మణుడిపై కోపం తెప్పిస్తుంది .

Essay on Sita in Telugu Language

క్షమ..దయ...ధైర్యం...వివేకం...ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర ‘సీత'. సతీ లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు ఊహించలేము. కాబట్టే రామాయణ ఇతిహాసంలో ఆమె పాత్రపై ఎందరో మహానుభావాలు మరియు మేథావులు పరిశోధనలు కూడా చేశారు. సీతలోని సుగుణాలు నేటి మగువలకు ఎంతో ఆదర్శం. ఆమె చరితం ఓ స్ఫూర్తిదాయకమైన కథాసాగరం. రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సీత గుణగుణాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి... 

ధర్మమూర్తి: సీత ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గృహిణిగా మారిన మహాసాధ్వి ‘సీతాదేవీ'. రాముడు తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి అరణ్యవాసానికి వెళ్లినప్పడు తన భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్దమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. 

దయాశీలి: పేదవారిని ఆదరించి అన్నం పెట్టాలన్న దయాగుణం గల స్త్రీమూర్తి సీత. అదే భావనతో తనింటికి మారువేషంలో బిక్షాటన వచ్చిన రావణుడికి లక్ష్మణరేఖ దాటి మరీ భిక్షం వేసిన దయామూర్తి ఆమె. తన రక్షణ కోసం పెట్టుకున్న నియమం కన్నా దానమే గొప్పదన్న నీతిని ఆమె ఈ సందర్భంలో వెల్లడిస్తున్నది. 

ధైర్యశాలి: పాతివ్రత్య నిరూపణ కోసం సీతను అగ్నిప్రవేశం చేయమని రాముడు అడిగినప్పుడు ధీరత్వంతో ఆ పనికి సిద్ధమైన ధైర్యశాలి సీత. రాముని మాటలు ఆమె గుండెను గాయపరిచినా సహనంతో భరించింది. తానే తప్పు చేయలేదన్న ఆమె ఆత్మవిశ్వాసం చివరికి నిందారోపణ చేసిన వారిని సైతం తలదించుకునేలా చేసింది. 

అభిమానవతి: సీతకు ఆత్మాభిమానం ఎక్కువ. చిత్రకూటానికి సీతారాములు వచ్చారని తెలిసి, ఆమె తండ్రి జనకుడు వారిని కలిసి వనవాసం పూర్తయ్యేదాకా మిథిలానగరానికి వచ్చి తనతో పాటు ఉండమని కోరినప్పుడు, ఆ మాటలను సున్నితంగా తిరస్కరించిన ఆత్మాభిమాని సీత. మెట్టినింటికొచ్చాక ఎన్ని విషమ పరిస్థితులెదురైనప్పటికీ తమే పరిష్కరించుకోవాలి గానీ, పుట్టింటి వారిని ఇబ్బంది పెట్టకూడన్న అభిమానవతి సీత. 

జంతు ప్రేమికురాలు: ప్రకృతి మీద, పశుపక్ష్యాదుల మీద ఎనలేని ప్రేమ కలిగిన స్త్రీమూర్తి సీత. అదే ప్రేమతో అందమైన జింకను తన కోసం తీసుకురమ్మని భర్తను అభ్యర్థిస్తుంది సీత. 

వివేకవంతురాలు: రావణాసురుడు తనను అపహరించి తీసుకెళ్లిపోతున్నప్పుడు, రాముడికి తన ఆనవాళ్లు చిక్కడం కోసం బంగారునగలను నేల మీద జారవిడిచిన వివేకవంతురాలు సీత. 

ప్రేమమూర్తి: సీతకు రామునిపై ఎంతటి ప్రేమానురాగాలంటే..ఆ ప్రేమలో తనను తానే మైమరిచిపోయేది. రావణుడి చెరలో బందీగా ఉండి కూడా నిత్యం శ్రీరామనామస్మరణ చేస్తూ అనుక్షణం పతి క్షేమాన్ని కోరేది. 

చైతన్యశీలి: సీత ఎంత చైతన్యశీలి అంటే అపాయంలో కూడా భయంతో ఆమె శత్రువులకు లొంగలేదు. రావణడు సీతను బెదిరించి, తన వశం కావాలని ఆదేశించినప్పుడు, ఒక గడ్డిపరకను అడ్డంగా పెట్టుకొని నువ్వు నాకు దీనితో సమానం అని చెప్పకనే చెప్పి అతని ధర్మహీనతను ప్రశ్నించిన ప్రజ్ఝావంతురాలామె. 

క్షమాగుణం: రాక్షస సంహారం తర్వాత సీతను అవోకవనం నుంచి విడిపించి తీసుకువెళ్తున్న సమయంలో, తను బందీగా ఉన్నప్పుడు ఆ వనంలో తనను మాటలతో హింసించిన రాక్షసులకు ఏ కీడు తలపెట్టవద్దని, వారు స్వామిభక్తితో తమ బాధ్యతను మాత్రమే నిర్వర్తించారని హనుమంతునితో చెప్పిన క్షమాగుణం సీత సొంతం. 

ఆదర్శమూర్తి: అడవిలో ఆశ్రమవాసిగా కాలం గడుపుతూ కూడా తన కుమారులను ప్రయోజకుల్ని చేయాలని ఎల్లవేళలా తపిస్తూ, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడం ఆమె ఉత్తమ పెంపకానికి నిదర్శన


SHARE THIS

Author:

Etiam at libero iaculis, mollis justo non, blandit augue. Vestibulum sit amet sodales est, a lacinia ex. Suspendisse vel enim sagittis, volutpat sem eget, condimentum sem.

0 Comments: