Essay on Telugu in Telugu Language తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

In This article read "Essay on Telugu in telugu language", "తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం", "Importance of Telugu Paragraph" in Telugu.

Essay on Telugu in Telugu Language

మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం.  మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే  గౌరవించాలి.  అది తెలుగు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, హింది  కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది.  మనం తెలుగు భాష తక్కువ అని  అనుకో కూడదు.  తెలుగు భాష కి చాలా చరిత్ర ఉంది.  తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది.   అందులో ఎందరో కవులు, రచయితలు  గ్రంధ కర్తలు చాలా చాలా రచనలు చేశారు.  పర భాష లను గౌరవించడమే తెలుగు భాష, తెలుగు వారి గొప్పతనం.  ప్రపంచపు తెలుగు మహాసభలు అమెరికాలోనూ ,  పశ్చిమ ఆసియా లోనూ , ఆంధ్ర తెలంగాణ లోనూ ప్రతి  సంవత్సరం  జరుగుతాయి.  అమెరికా తెలుగు వారింకా  తెలుగుని గౌరవిస్తున్నారంటే,  దానర్ధం తెలుగు చాలా గొప్పదనేగా.

తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి.  గొప్పవాళ్లు రాసిన రచనలు పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లెగీతాలు, కూనిరాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ రచనలు , విప్లవ గీతాలు చదవాలి.  ఎన్నిటిలోనూ వారు చేసే భావ ప్రకటన, కొత్త కొత్త పదాలు, ప్రాసలు, సంగీతాలంకారాలు, జ్ఞానం, చరిత్ర తెలుస్తాయి.

మన పట్టణాలు, పల్లెలు, అక్కడ ఉండే ప్రజలు, విహారయోగ్యమైన ప్రదేశాలు, యాత్రికుల అనుభవాలు, కట్టడాలు, సెలయేర్లు, అడవులు, వన్య ప్రదేశాలు, గుడులు గోపురాలు, ఇంకా నదులు, పుణ్య క్షేత్రాలు,  ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మన ప్రదేశాలలో.  కానీ మనం అన్నీ చూడలేము.  వాటినిగూర్చి మనం తెలుసుకొని  ఇంకొకరికి ఆవిషయాలు చెప్పాలి.  మన భాష గొప్పతనం ముందర మనం అర్ధం చేసుకొని  తరువాత అది తెలియని వారికి చెప్పాలి.

మన  భాషలో ఎన్నో గొప్ప భకృ గీతాలు, మహాభారతం, రామాయణం ,  భాగవతం, దశావతారాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి.  మనం ఈకాలంలో ఇవేవీ చదవకుండా పాశ్చాత్య సంస్కృతి పైనే ఎక్కువ మక్కువ చూపడం  న్యాయం కాదు పద్ధతి కాదు.  అది మాతృ ద్రోహం చేయడమే.

భారత దేశం లో  ఎన్నో భాషలు ఉన్నాయి.  ఎవరి భాష వారు నేర్చుకొని అందులో ఉన్న తీపి ని  ఆస్వాదించ గలిగితే,  వారు తప్పకుండ మాతృభాషలకు అభిమానులౌతారు.  ఈ కాలం లో పిల్లలు మాతృ భాషను కించపరచ రాదు.  ఇంగ్లీషు హింది మరి ఇతర భాషలు నేర్చుకోవాలి.  కానీ  తెలుగు భాషని గౌరవించాలి.

తెలుగు భాష దక్షిణ భారత దేశం లో  ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లో ని ప్రజల లోకవాక్కు.  ఇది చాలా తీయనిది.  తెలుగుని  "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అని  పాశ్చ్యతులు  కొనియాడారు.  తెలుగు వ్యాకరణం చాలా సులభం.  సంస్కృతంలో ఉన్న వైభవం తెలుగు లో కూడా ఉంది.  తెలుగుని  తొమ్మిది కోట్ల తెలుగువాళ్లు మరి ప్రపంచం లో నలు మూలలా వ్యాపించి ఉన్న లక్షల మంది తెలుగు వాళ్ళు మాట్లాడతారు.  భారత దేశం అతిముఖ్యమైన భాషలుగా గుర్తించిన 6 భాషల్లో తెలుగు ఒకటి. 

అచ్చులు (vowels) సంపూర్ణంగా మనం తెలుగు లో పలుకుతాం.  దేశభాషలందు తెలుగు లెస్స అని అలనాటి చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు అన్నాడు.  ఆయన కాలం లో తెలుగు బాగా అభివృద్ధి చెందినది. (విజయవాడ దగ్గరి ) శ్రీకాకుళ ఆంధ్రవిష్ణు అని పేరుపొందిన రాజు తెలుగుని ప్రోత్సహించారు.  తెలుగు లో పద్యాలు క్లుప్తంగా ఉంటాయి ఎంతో అర్ధాని ఇస్తాయి.  నన్నయ, తిక్కన, ఎఱ్ఱన (ఎఱ్ఱాప్రగడ), తెనాలి రామకృష్ణ కవి, ముక్కు నంది తిమ్మన, తిరుపతి వెంకట కవులు, వేమన, బమ్మెర పోతన లాంటి మహా మహులు తెలుగు లో రచనలు చేసి  జాతి గౌరవాన్ని, భాష స్థాయిని ఆకాశానికి  ఎక్కించారు.

త్యాగరాజు కృతులు, అన్నమయ్య కీర్తనలు కోట్లాది మండి నోళ్లలో  ఎపుడూ నానుతూనే ఉంటాయి.  క్రీస్తు పూర్వం 300 వ సంవత్సరం లోనే భట్టిప్రోలు కవి తన రచనలు చేశాడు.  చాళుక్యుల కాలం లో , ఇక్ష్వాకుల కాలం లో  తెలుగు ఎంతో అభి వృద్ధి చెందింది.  జక్కన, గొన బుద్ధారెడ్డి (రామాయణం), గౌరన  కవులు భక్తి రచనలు చేశారు.  శ్రీనాధుని  కావ్యాలు అతి సుందరమైనవి మరి అత్యంత ఆహ్లాదమైనవి.  చిన్నయ సూరి  తెలుగు వ్యాకరణాన్ని రాశాడు. 

ఆధునిక కవులలో రచయితలలో,  విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ అప్పారావు, నండూరి సుబ్బారావు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి,  మహాకవి శ్రీశ్రీ , సి నారాయణ రెడ్డి  ఎంతో గొప్పవాళ్లు.  సామాజిక సమస్యల పైన  ప్రజలకు అవగాహన కలిపిస్తూ ఎన్నో కవితలు, వ్యాసాలు , గేయాలు  రాశారు.

ఇంత గొప్పభాష తెలుగు భాషాదినోత్సవం  ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుపుతుంది.   తెలంగాణ  తన రీతి లో తెలుగు వారందరి తోను  తెలంగాణ దినోత్సవ వేడుకలలో  సాంస్కృతిక కార్యక్రమాలు  జరుపుకొంటుంది. 


SHARE THIS

Author:

Etiam at libero iaculis, mollis justo non, blandit augue. Vestibulum sit amet sodales est, a lacinia ex. Suspendisse vel enim sagittis, volutpat sem eget, condimentum sem.

2 comments:

  1. Dhinilo main one eee ledhu
    Adhi emiti anthe
    Desha basha landhu Telugu lesaa

    ReplyDelete