తెలుగు భాష గొప్పతనాన్ని వివరించే వ్యాసాలు - telugu bhasha yokka pramukyatha Essay

తెలుగు భాష గొప్పతనాన్ని వివరించే వ్యాసాలు - telugu bhasha yokka pramukyatha Essay

మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం.  మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే  గౌరవించాలి.  అది తెలుగు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, హింది  కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది.  మనం తెలుగు భాష తక్కువ అని  అనుకో కూడదు.  తెలుగు భాష కి చాలా చరిత్ర ఉంది.  తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది.   అందులో ఎందరో కవులు, రచయితలు  గ్రంధ కర్తలు చాలా చాలా రచనలు చేశారు.  పర భాష లను గౌరవించడమే తెలుగు భాష, తెలుగు వారి గొప్పతనం.  ప్రపంచపు తెలుగు మహాసభలు అమెరికాలోనూ ,  పశ్చిమ ఆసియా లోనూ , ఆంధ్ర తెలంగాణ లోనూ ప్రతి  సంవత్సరం  జరుగుతాయి.  అమెరికా తెలుగు వారింకా  తెలుగుని గౌరవిస్తున్నారంటే,  దానర్ధం తెలుగు చాలా గొప్పదనేగా.

తెలుగువారి మంచి మనసు, వేరే భాషలవారిని ఆదరించే గుణం లోనే తెలుస్తుంది తెలుగు తీపి, తెలుగు వారి గొప్పతనం.

తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి.  గొప్పవాళ్లు రాసిన రచనలు పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లెగీతాలు, కూనిరాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ రచనలు , విప్లవ గీతాలు చదవాలి.  అన్నిటిలోనూ వారు చేసే భావ ప్రకటన, కొత్త కొత్త పదాలు, ప్రాసలు, సంగీతాలంకారాలు, జ్ఞానం, చరిత్ర తెలుస్తాయి

మన  భాషలో ఎన్నో గొప్ప భకృ గీతాలు, మహాభారతం, రామాయణం ,  భాగవతం, దశావతారాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి.  మనం ఈకాలంలో ఇవేవీ చదవకుండా పాశ్చాత్య సంస్కృతి పైనే ఎక్కువ మక్కువ చూపడం  న్యాయం కాదు పద్ధతి కాదు.  అది మాతృ ద్రోహం చేయడమే.



SHARE THIS

Author:

Etiam at libero iaculis, mollis justo non, blandit augue. Vestibulum sit amet sodales est, a lacinia ex. Suspendisse vel enim sagittis, volutpat sem eget, condimentum sem.

0 Comments: